ఆగిన రేషన్ ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు

రాయచోటి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 11 నెలలు అవుతున్నా ఇంకా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కోడ్‌ విడుదల కావడంతో అప్పటి నుంచి కొత్త రేషన్‌ కార్డుల మంజూరు నిలిచి పోయిందన్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు కావాలని, పేర్లు మార్పు చేయాలని, అడ్రస్‌లు మార్పు చేయాలని, కార్డులలో పిల్లల పేర్లు యాడ్‌ చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారన్నారు. అలాగే డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కార్డులు కూడా కొత్తవి మంజూరు కాలేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల్లో పేర్లనమోదు,మార్పు తదితర పక్రియ కూడా ఎన్నికల సమయం నుంచి నిలబడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,త్వరితగతిన నూతన రేషన్,ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Facebook
X
LinkedIn
WhatsApp