కమనీయంగా ద్రౌపది కళ్యాణం

వీరబల్లి :
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం మట్లి గ్రామం మాండవ్య నది ఒడ్డున జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా సోమవారం ద్రౌపది కల్యాణం కమణీయంగా జరుగుతోంది. రాయచోటికి చెందిన టీడీపీ నేత మడితాటి శ్రీనివాసులు రెడ్డి సతీసమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి దాదాపు 20,000 మందికి పైగా భక్తుల పాల్గొన్నారు. ద్రౌపది కల్యాణోత్సవ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది కూడా మట్టి, రెడ్డివారి పల్లి గ్రామ ప్రజలు ఎంతో పవిత్రంగా మహా భారతాన్ని జరిపించడం చాలా అభినందనీయంగా ఉందని శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధం, ధర్మం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మహాభారతం కమిటీ నిర్వాహకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.

Facebook
X
LinkedIn
WhatsApp