లక్కిరెడ్డిపల్లి, మార్చి 22 :
క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని లక్కిరెడ్డి పల్లి యస్ఐ రవీంద్రబాబు హెచ్చరించారు. శనివారం నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల బెట్టింగ్ లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని లక్కిరెడ్డి పల్లి యస్ఐ రవీంద్రబాబు తెలిపారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రాయచోటి డిఎస్పి క్రిష్ణ మోహన్ ఆదేశాలతో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామాలలో క్రికెట్ బెట్టింగుల వ్యవహారలను పసిగట్టేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వారు తెలిపారు. బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రత్యేక బృందంతో పాటు తాను తమ సిబ్బందిలు కూడా నిరంతరం కేఫ్, టీ పాయింట్లు హోటల్స్ లలో కూడా క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారికోసం పరిశీలిస్తామని తెలిపారు. తమ పిల్లల ప్రవర్తనపై తమ ఆర్థిక లావాదేవీలపై పెద్దలు గమనించాలని సూచించారు.
