అన్నమయ్య జిల్లా రామపురం మండల కేంద్రంలోని వాల్మీకిపురంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తాగునీటి బోరు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా కాలనీవాసులు నీటి సమస్య ఇబ్బంది పడుతున్నాడంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకోవడంతో వెంటనే మంత్రిగారి ఆదేశాలతో బోరు ,మోటార్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి, మహబూబ్ బాషా, చెన్న కృష్ణారెడ్డి ,అన్నయ్య ,కదిరెప్ప నాయుడు ,భవనం వెంకటరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 3